బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. భగవంత్ కేసరి వాయిదా..!!

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా దసరా బరిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే యాక్టర్ అర్జున్ రాంపాల్ ఇందులో విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది.


దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోందని చిత్ర బృందం ప్రకటించారు. ఆయుధ పూజతో గీసారి దసరా జోర్దార్ ఉంటది.. గన్స్ పట్టుకొని బాలయ్య నడిచి వస్తున్న ఒక ఫోటోతో చిత్ర బృందం తెలియజేశారు.. అయితే నాలుగు రోజుల క్రితం వరకు ఇదంతా బాగానే ఉన్నప్పటికీ తాజాగా సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు భగవంత్ కేసరి చిత్రం అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే అన్నట్లుగా వినిపిస్తోంది. అందుకు కారణం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడమే అన్నట్లుగా సమాచారం.

దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున లీడ్ బాలయ్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి మాత్రం బాలయ్య లేని సీన్స్ షూట్ చేస్తూ ఈ సినిమాని ఫినిష్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగుకు బాలయ్య మరో ఐదు రోజులు డేట్లు కేటాయించి పూర్తి చేస్తే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మరి అనుకున్న సమయానికి బాలయ్య వస్తారో లేదో చూడాలి మరి.