‘ కాంతార ‘ ప్రీక్వెల్ నుంచి సాలిడ్ అప్ డేట్….నయా లుక్ లో రిషబ్….!!

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ‘ కాంతార స సీక్వెల్‌కు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

కాగా ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి 11కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో బాడీ భారీగా తగ్గించాడని.. ఫస్ట్ పార్ట్ ఊహించని రేంజ్ లో హిట్ కావడంతో రిషబ్ శెట్టికి హోంబలే సంస్థ కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం. దీంతో సీక్వెల్‌ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా రిషబ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

అంతేకాకుండా కాంతార లో ఒకరిద్దరూ మినహాయించి పెద్దగా స్టార్ కాస్ట్ ఏమి లేకపోగా.. సీక్వెల్‌కు మాత్రం పలువురు స్టార్స్ ను తీసుకోబోతున్నట్లు టాక్. ఇక నవంబర్లో షూటింగును మొదలుపెట్టి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక తొలిపార్టుకు రూ. 16 కోట్లు ఖర్చు పెట్టగా సీక్వెల్‌ కోసం ఏకంగా రూ.120 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నట్లు సమాచారం.