వ్యాంప్ క్యారెక్టర్ చేసిన ఆ నటికి.. మహేష్ సినిమాలో అలాంటి పాత్ర..!

టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత ఒకప్పుడు ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బ్యూటీ అప్పటి సినిమాల్లో వ్యాంప్ పాత్రులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం తెలుగు బుల్లితెర సీరియల్లలో నటిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా కొన్ని సినిమాలలో మెరుస్తుంది. జయలలిత గతంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే సినిమాలో స్పీకర్గా కూడా నటించింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ పాత్రకు కొరటాల శివ జయలలితను ఎన్నుకున్నప్పుడు చాలామంది అతనిని హెచ్చరించారట. వ్యాంప్‌ క్యారెక్టర్లు చేసే ఆమెకి స్పీకర్ లాంటి అత్యున్నత పాత్రను ఇస్తే సరిగా ఉండదని ఫైర్ అయ్యారట. ఇక ఓ ఇంటర్వ్యూలో ఆ సమయంలో కొరటాల శివ ఏం చేశాడు అనేది జయలలిత వివరించింది. కొర‌టాల శివ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వ్యాంప్‌ క్యారెక్టర్స్ చేసే జయలలితకు ఇలా మీరు స్పీకర్ వేషం ఎందుకు ఇచ్చారు అని.

అందుకు శివ గారు చెప్పిన ఆన్సర్ నాకు ఎంతో బాగా నచ్చింది. నేను ఆమెలో వ్యాంప్‌ని చూశారేమో నాకు ఆమె చీరకట్టులో ఒక అమ్మతనం కనిపించింది అన్నాడట. ఆయన మాటలకు నేను ఎంతగానో రుణపడిపోయాను. ఆ సినిమా ఈవెంట్ స్టేజిపైనే నేను చెప్పేసా.. మళ్లీ జన్మంటూ ఉంటే కొరటాల శివ నా కడుపున పుట్టాలని కోరుకుంటున్నాను అని. అయితే ఈ సినిమా తర్వాత నాకు పెద్ద సినిమా అవకాశాలు ఏమీ రాలేదు అంటూ వివరించింది. ప్రస్తుతం జయలలిత చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.