మాయ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్న డెవిల్ ఫస్ట్ గ్లింప్స్‌..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న మూవీ డెవిల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని నెలకొల్పగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్ సింగిల్ మాయ చేసి ప్రోమోను రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. ఇక ఈ పాట ఆడియోన్స్‌ను ఆకట్టుకుంది.

ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను సెప్టెంబర్ 19 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వివరించారు. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డెవిల్ ముసుగేసుకుని బ్రిటీషర్లు కోసం కళ్యాణ్ రామ్ ఎందుకు పనిచేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. అభిషేక్ పిక్చర్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా నవంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక చివరగా కళ్యాణ్రామ్ నటించిన బింబిసారా మూవీ సూపర్ హిట్ కావడం అలాగే ఇప్పటివరకు సంయుక్తమీన‌న్‌ తెలుగులో నటించిన సినిమాలన్నీ హిట్ సినిమాలే కావడంతో ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.