విజయ్ సేతుపతి పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..!!

తమిళ్ ,హిందీ ,కన్నడ, మలయాళం ,తెలుగు వంటి భాషలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి.. ఒకవైపు హీరోగా విలన్ గా ఎలాంటి పాత్రలోనైనా సరే దర్శక నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ పాత్రకి న్యాయం చేయగలడు విజయ్ సేతుపతి. అగ్ర హీరోల లిస్టుల పేరు సంపాదించిన విజయ్ సేతుపతి 50 సినిమాలలో నటించారు. రీసెంట్గా షారుక్ తో కలిసి జవాన్ చిత్రంలో విలన్ గా నటించారు.

Vijay Sethupathi credits wife for his success | Vijay Sethupathi | wife |  family | films | Tamil cinema | fans

విజయ్ సేతుపతి కెరియర్ లో ఎన్నో కష్టాలను అధిగమించి పరాజయలను సైతం పలకరించి ప్రస్తుతం నటుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో ఎవరు సపోర్టు లేకుండా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న నటుడుగా గుర్తింపు సంపాదించారు విజయ్ సేతుపతి.. అయితే సినీ జీవితాన్ని పక్కన పెడితే తన పర్సనల్ లైఫ్ లోకి వెళితే ప్రేమ పెళ్లి అని తన జీవితంలో వచ్చిన అమ్మాయి గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

ఆ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఇండస్ట్రీలోకి రాకముందు అకౌంట్ గా కూడా పనిచేశారట. 2000 నవంబర్లో ముంబైలో కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన తర్వాత అకౌంటెంట్గా పనిచేయడానికి దుబాయ్ కి వెళ్ళాడట అక్కడ అందుకున్న జీతం రూ .12 వేల రూపాయలేనట.. విజయ్ సేతుపతిది లవ్ మ్యారేజ్ దుబాయిలో పనిచేస్తున్నప్పుడు తన భార్య జెస్సి కూడా దుబాయ్ లోనే ఉండేదట. ఫేస్బుక్ పరిచయం ద్వారా చాటింగ్ తో తన స్నేహబంధం ఏర్పడి అలా ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారట. విజయ్ సేతుపతి కూడా తన కొలీగ్ స్నేహితురాలట. వీరి ప్రేమ పెళ్లిని ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని వివాహం చేశారట.వీరికి ఒక కుమారుడు కుమార్తె కలదు.