రెండో పెళ్లి కోసం ఆరాటపడుతున్న నటుడు శ్రీకాంత్.. పోస్ట్ వైరల్..!!

ప్రస్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న నదులలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఒకరు.. ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.. ఇటీవలే వచ్చిన సామజవరగమన సినిమాలో కూడా నటించి మెప్పించిన శ్రీకాంత్ బెదురులంక-2012 చిత్రంలో కూడా దొంగ స్వామీజీగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.. ఈ రెండు సినిమాలు విజయం కావడంతో నటుడుగా మంచి పేరు సంపాదించారు శ్రీకాంత్ అయ్యంగార్..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా శ్రీకాంత్ ఒక ఫోటోని షేర్ చేసి వెంటనే డిలీట్ చేయడం జరిగింది.. లేడీ ఫోటోగ్రాఫర్ ఏలీ అనే యువతీతో దిగిన ఫోటోని షేర్ చేయడం జరిగింది.. “అందుకు క్యాప్షన్ గా మై లవ్ ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను అటు రాసుకొచ్చాడు”..ఆ కొద్దిసేపటికి ఫోటోని డిలీట్ చేయడంతో పబ్బులో కలిసిన ఫోటోగ్రాఫర్తో శ్రీకాంత్ పులిహోర కలుపుతున్నారు అంటూ పలువురు నెటిజెన్లు సైతం తెగ వైరల్ గా చేశారు.

అయితే గతంలో కూడా శ్రీకాంత్ కు వివాహమై విడాకులు కూడా అయ్యాయి ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న ఆయన రెండో పెళ్లి కోసం ఆరాటపడుతున్నారు.. అందుకే ఇలా పులిహోర కలుపుతున్నారంటూ పలువురు సైతం కామెంట్స్ చేస్తున్నారు.. రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు కానీ ఇలా ఫోటోను ఆమెను అడిగి షేర్ చేశారా.. లేకపోతే డిలీట్ ఎందుకు చేస్తారు అంటూ నేటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు.. మరి కొంతమంది తాగిన మత్తులో ఇలా చేసి ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు.