న్యూయార్క్‌లో ప‌వ‌న్ జ‌న‌సేన జెండా స‌రికొత్త రికార్డ్‌..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాక తనదైన స్టైల్ లో రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నాడు. ఇక నిన్న(సెప్టెంబ‌ర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యిప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

దేశ దేశాల్లో ఉన్న పవన్ అభిమానులు తమ అభిమాన హీరోకు విషెస్ చెప్పారు. అందులో భాగంగానే నిన్న అమెరికాలో ఆయన ఫ్యాన్స్ కూడా ఓ వినూత్న రీతిలో పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా మహానగరం న్యూయార్క్ సిటీలో ఉన్న టైమ్‌ స్క్వేర్స్ లోని 150 అడుగుల ఓ ఎత్తయిన భవనం పై పవన్ కళ్యాణ్‌ జ‌న‌సేన‌కి సంబంధించిన ఫోటోలను డిస్ ప్లే చేశారు. ఈ ప్రోగ్రాంకు పవన్ కళ్యాణ్ ఎన్‌ఆర్‌ఐ అభిమానులంతా భారీ ఎత్తున హాజరయ్యారు.

ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్ ఫొటోస్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి 15 సెకండ్ల పాటు ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు.