మాస్‌కా దాస్ విశ్వ‌క్‌సేన్‌కు స‌డెన్ స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చిన బాల‌య్య‌…!

నందమూరి నట‌సింహం బాలయ్య‌.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయనకు ఒక్కసారి ఎవరైనా నచ్చితే లైఫ్ మొత్తం వాళ్ళని మర్చిపోడు. అందుకే కొట్టినా, పెట్టిన బాలయ్యే అని చాలామంది సన్నిహితులు అంటూ ఉంటారు. ఇక తాజాగా బాలయ్య మాస్ కా దాస్ విశ్వక్‌కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం గ్యంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వ‌క్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.

అంజలి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సెట్స్‌లో బాలయ్య మెరిసి మూవీ టీమ్‌కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా విశ్వక్ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకున్నాడు. మీ సపోర్ట్‌కు చాలా చాలా థాంక్స్. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మీ రాకతో మా మూవీ టీమ్ అంతా ఎంతో సంతోషించారు. దురదృష్టవశాత్తు నా పూర్తి ఫోటోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను.

సినిమా లుక్‌ రివిల్ అవుతుందనే ఉద్దేశంతో నేను బాలయ్య కలిసి ఉన్న పిక్‌ను రివిల్ చేయలేదు. సినిమా రిలీజ్ అయ్యాక కచ్చితంగా నా ఫుల్ పిక్చర్స్, వీడియో రిలీజ్ చేస్తాను. అప్పటివరకు ఫ్రేమ్‌లో ఉన్న బాలయ్య బాబు చాలు.. ఫైర్ అంటూ రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొదటి నుంచి కూడా విశ్వక్‌కు.. బాలయ్య‌ నుంచి సపోర్ట్ గట్టిగా ఉంటుంది. దీంతో వీరిద్దరి కాంబోలో ఒక షో వస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)