మ‌ళ్లీ రామ్‌చ‌ర‌ణ్ – చిరంజీవి సినిమా వ‌స్తోంది…!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కియార అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ బుచ్చిబాబు సనాతో ఉండనుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజిగా ఉన్న ఈ సినిమా.. షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుంద‌ని టాక్. ఈ సినిమాలో అతిధి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించ బోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ న్యూస్ లో ఏమాత్రం నిజం లేదట. అంత‌కు ముందు ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో ఇంతకుముందు వచ్చిన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో కూడా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడేమోనని చాలామంది ప్రేక్షకులు నమ్మారు. కానీ ఇందులో కూడా ఏమాత్రం నిజం లేదు.

ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. చరణ్ నుంచి మళ్లీ రంగస్థలం లాంటి ఓ నేచురల్ అండ్ ట్రస్టిక్ డ్రామా రాబోతుందంటూ తెలుస్తుంది.