“శునకానందం పొందొద్దని నీ మాజీ మొగుడికి చెప్పు” రేణు దేశాయ్‌కి అంబటి వార్నింగ్…

త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్న కారణంగా ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కి పోతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి, వైసీపీ నేత అంబటి రాంబాబుకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమాలో అంబటి రాంబాబును ఉద్దెశించి శ్యామ్ బాబు అనే పాత్రను పెట్టినట్లు అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనను అగౌరవపరచడానికే ఆ పాత్రను సినిమా లో సృష్టించారని అంబటి రాంబాబు,  పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. అంబటి రాంబాబు ఈ విషయం గురించి ఢిల్లీ వరకు వెళ్లాడు.


ఇటీవలే జరిగిన ఒక ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు మాట్లాడుతూ ‘ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం గురించి కూడా నేను ఒక సినిమా తీస్తాను’ అని చెప్పుకొచ్చాడు . ఆ మాటలు విన్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించింది. రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ పేజీ లో ఒక వీడియో ను షేర్ చేస్తూ ‘ నా మాజీ భర్త, భార్య పిల్లల గురించి కొంతమంది సినిమాలు,వెబ్ సిరీస్ లు తియ్యడానికి రెడీ అయ్యినట్లు నాకు తెలిసింది. అలాంటి వారందరికి ఒక విన్నపం. ఇలాంటి వాటిలోకి పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు?. సినీ స్టార్ కాబట్టి రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యక్తి కాబట్టి అతని గురించి పిల్లలు మాటలు పడాల్సిన అవసరం లేదు’. అని ఆమె ఫైర్ అయింది.

అలానే ‘ పిల్లలు రాజకీయాల్లో వేలు పెట్టట్లేదు కదా, మరి మీరెందుకు పిల్లల్ని రాయకీయాలోకి లాగి వారి భవిష్యత్తును పాడుచేయ్యాలనుకుంటున్నారు. నేనొక తల్లిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిన, హెటర్స్ అయిన, ఆయనని సపోర్ట్ చేసేవారెవరైనా సరే పిల్లల జోలికి మాత్రం రావొద్దు ‘ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి డబ్బు మీద వ్యామోహం లేదని, కేవలం ప్రజల బాగు కోరుకునే వ్యక్తిగానే రాజకీయాల్లో ఉన్నారని, అందుకే పొలిటికల్ గా తను పవన్ కి సపోర్ట్ చేస్తానని రేణు దేశాయ్ పేర్కొన్నారు.

ఇక తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో పై అంబటి రాంబాబు స్పందిస్తూ ‘అమ్మ రేణు! మీ మాజీకి చెప్పు మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందోదని ‘ అంటూ ట్విట్ చేసాడు. ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ గురించి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.