ఆ హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన విశాల్..!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్ సినిమాలకు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. కాగా ప్రస్తుతం తమిళ్ మూవీస్ లో బిజీగా గడుపుతున్న ఇత‌డు ఇప్పటికి పెళ్లి చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్‌ని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ విశాల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇంతకీ విశాల్‌ పెళ్లి చేసుకోబోయే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అంటూ విశాల్ పెళ్లి చేసుకోబోతుంది ఆమెనే..? అంటూ కోలీవుడ్లో రకరకాల ట్యాగ్స్‌తో వార్తలు వైరల్ అయ్యాయి. కోలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన‌ లక్ష్మి మీనన్‌ని విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఈ వార్తలపై విశాల్ కానీ లక్ష్మీ మీనన్ కానీ ఎవరు స్పందించలేదు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే వారు స్పందించాల్సిందే అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ విషయంపై స్పందించిన విశాల్‌ మాట్లాడుతూ ఇందులో నిజం లేదని.. అది కేవలం పుకారు మాత్ర‌మే అంటూ.. లక్ష్మీ మీనన్ తో తన పెళ్లిపై వస్తున్న న్యూస్ కి చెక్ పెట్టాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ లను ప్రచారం చేయడం మానుకోండి అంటూ విశాల్ పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రంట్ లో తన మూవీ మార్క్ ఆంఠోని సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు విశాల్‌. ఈ మూవీ వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.