వ‌రుణ్ – లావ‌ణ్య పెళ్లి ఆమె గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తేనే అవుతుందా..!

యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి. గత కొంతకాలంగా వీరిద్దరూ లవ్ లో ఉన్నట్టు పుకార్లు షికారులు చేశాయి. వీరిద్దరూ ఇటీవల ఎంగేజ్మెంట్‌తో ఈ న్యూస్‌ల‌ పై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా వీరిద్దరి పెళ్లి గురించి కొన్ని న్యూస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా వరుణ్ మ్యారేజ్ డేట్, ప్లేస్ లాంటి అంశాలపై వచ్చిన న్యూస్‌ల‌కు క్లారిటీ ఇస్తూ వరుణ్ స్పందించాడు.

నవంబర్, డిసెంబర్ లో వాళ్ల పెళ్లి ఉండవచ్చని క్లారిటి ఇచ్చాడు. మ్యారేజ్ డేట్ ని ఫిక్స్ చేసేది మాత్రం మా అమ్మనే ఆమె తేదిని ఫిక్స్ చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. అదే నా సెంటిమెంట్.. మ్యారేజ్ ప్రైవేటుగా చేసుకోవాలి అనుకుంటున్నాం చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంటాం అది మన హైదరాబాదులో సాధ్యం కాదు అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసామంటూ చెప్పుకొచ్చాడు.

మొత్తంగా ఇండియాలో మూడు ప్లేస్లలో అనుకుంటున్నాం.. విదేశాల్లో రెండు ప్లేస్లను పరిశీలించాం త్వరలోనే ఆ ప్రాంతాన్ని కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. ముందు డేట్ ఫిక్స్ అయ్యాక ప్లేస్ ని డిసైడ్ చేద్దామని ఆగమంటూ వరుణ్ తేజ్ వివరించాడు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరులవుతున్నాయి. దీంతో లావణ్య – వరుణ్‌ల‌ పెళ్లి విషయంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక వీరిద్దరి పెళ్లి డేట్ వరుణ్ తేజ్ అమ్మ ఎప్పుడు ఫిక్స్ చేస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్.