పుష్ప -2 అదిరిపోయే అప్డేట్.. జాలి రెడ్డి పోస్టర్ వైరల్..!!

టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.. పుష్ప మొదటి భాగం విడుదలై భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప -2 చిత్రాన్ని అంతకుమించి అనేలా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తూ ఉన్నారు. హీరోయిన్గా రష్మిక నటిస్తూ ఉండగా అనసూయ, సునీల్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. గతంలో పుష్ప-2 చిత్రానికి సంబంధించి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ విడుదల చేయగా వైరల్ గా మారింది.

Pushpa 2 The Rule team wishes the talented Dhananjaya, aka Jolly Reddy a  very happy birthday | IWMBuzz

పుష్ప సినిమాలోని ప్రతి ఒక్కరి నటన అందరిని ఆకట్టుకునేలా చేసింది..ముఖ్యంగా ఇందులో జాలి రెడ్డిగా నటించిన ధనుంజయ అందరిని బాగానే ఆకట్టుకున్నారు ముఖ్యంగా పుష్పలో రష్మిక ఎత్తుకెళ్లే సీన్ అల్లు అర్జున్ ఫైట్స్ సన్నివేశాలు ధనంజయ బాగా గుర్తుండిపోయేలా చేశారని చెప్పవచ్చు.. పుష్ప -2 సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు పుష్ప లో చాలా మాస్ లుక్కులో నల్ల చొక్కా ధరించి నుదుటిన బొట్టు పెట్టుకొని మరి అగ్రేసివ్ గా కనిపించారు జాలిరెడ్డి..

ఇవాళ ఆగస్టు 23 సందర్భంగా బర్తడే స్పెషల్ గా ఒక పోస్టర్ని రిలీజ్ చేయడంతో అందరిని ఆకట్టుకుంటోంది ఈ పోస్టర్.. పుష్ప-2లో జాలిరెడ్డి ఈసారి స్కోర్ లను సెటిల్ చేయడానికి తిరిగి వస్తూ ఉంటాడు పుష్ప-2 ది రూల్ నుంచి విషెస్ తెలియజేశారు.. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. పుష్ప సినిమా సీక్వెలో వస్తున్న ఏ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందో చూడాలి మరి ఈ సినిమా వచ్చే యేడానికి చివరి కల్ల రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.