పవన్‌ హీరోయిన్ ఏకంగా 9 భాషల్లో నటించింది.. ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తుపట్టారా..?

ఏమే ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో క్రేజీ అవకాశాలను కొట్టేసింది. మొదటి నాలుగు సినిమాలే వరుసగా నాలుగు భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. చాలామంది స్టార్ హీరోయిన్స్‌కు సాధ్యం కానీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా 9 భాషల్లో నటించి రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..? ఈ పైన కనిపిస్తున్న నటి పవన్ కళ్యాణ్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించింది.

ఇప్పటికైనా ఈమె ఎవరో చెప‌గ‌ల‌రా..? ఈమె ప్రీతి జింగానియా పవన్ కళ్యాణ్ తో కలిసి తమ్ముడు సినిమాలో నటించిన ఈమె ఫ‌స్ట్‌ ఆల్బమ్ సాంగ్స్ లో మెరిసింది ఆ తర్వాత పలు యాడ్స్ లో నటించి తర్వాత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. మొదట ఓ మలయాళ సినిమాలో నటించినా.. ఈ సినిమా కంటే పవన్ కళ్యాణ్ తో నటించిన తమ్ముడు సినిమా నే ముందు రిలీజ్ అయింది. దీంతో టాలీవుడ్‌లో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటించింది. 1990లో ప్రీతిజింగానియా హీరోయిన్‌గా మలయాళ, తమిళ మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి. ఓవరాల్గా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, రాజస్థానీ ఇలా 9 భాషల్లో ఈమె నటించడం విశేషం.

ఈమె 18 ఏళ్ల సినీ కెరీర్‌లో 30కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే నటుడు ఫ‌ర్విన్‌ దబ్బాస్‌ని 2008లో వివాహం చేసుకుంది. ఈమెకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళి త‌ర్వాత కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రీతి 2012లో సినిమాలకు రియంట్రి ఇచ్చింది. రీఎంట్రీ తో ఈమెకు పెద్దగా సక్సెస్ వరించలేదు. అయితే ఈమె రీసెంట్ గా కఫాస్ వెబ్ సిరీస్ లో నటించింది. మొదటి గుర్తుపట్టకపోయినా తర్వాత తెలుగు ప్రేక్షకులు ప్రీతిని గుర్తించేశారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sabad (@sabadvisuals)