విడాకుల తర్వాత అలాంటి పోస్ట్ చేసిన నిహారిక… కారణం అదేనా..?

మెగా డాక్టర్ నిహారిక గత కొద్దిరోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా తను వివాహం చేసుకున్న చైతన్య తో విడాకుల వ్యవహారం వల్ల పలు రకాల ట్రోల్ కి కూడా గురైంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. మొదట యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా ఎదగాలని పలు ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేక పోయింది.

వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక ఇటీవలే పింక్ ఎలిఫెంట్ అనే పిక్చర్ బ్యానర్ తో ఒక నిర్మాణ సంస్థల స్థాపించింది. ఈ బ్యానర్ పైన పలు చిత్రాలను నిర్మించే విధంగా ప్లాన్ చేస్తోంది నిహారిక. ఇటీవలే డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. జూన్ 4వ తేదీన తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఇద్దరి అంగీకారంతోనే విడిపోతున్నామంటూ తమ వ్యక్తిగత విషయాలకు భంగం కలిగించవద్దు అంటూ కోరుతూ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది అయినప్పటికీ ఈమె పైన ట్రోల్స్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.

నిహారిక వాటన్నిటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తోంది తాజాగా ఇప్పుడు మరొకసారి ఒక పోస్ట్ షేర్ చేసింది.. జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయి ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి అలా కాకుండా ఒకే చోట ఆగిపోవాలని మనం కోరుకుంటే అవి సమాజానికి అడ్డుపడినట్టే దీనివల్ల అవసరమైన ఒత్తిడి కూడా పెరుగుతుందని కాబట్టి జీవితం ఎటు వెళ్తే అటు వెళ్లడం మంచిది.. ఈ జీవిత ప్రయాణం ఎక్కడికి వెళుతుందో తెలుసుకున్నాక మనం సర్ప్రైజ్ అవుతామంటూ ఒక కొటేషన్ ని షేర్ చేసింది. తన కెరియర్ లో జరిగిన ఒడిదుడుకుల వల్లే నిహారిక ఎక్కువగా ఒత్తిడికి గురవుతోందని ఈ పోస్టు ద్వారా తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)