ప్ర‌భాస్‌పై మ‌న‌సు పారేసుకున్నానంటోన్న ప‌వ‌న్ హీరోయిన్‌..!

మీరా చోప్రా పవన్ కళ్యాణ్ స‌ర‌సన బంగారం సినిమాతో మొదటిగా టాలీవుడ్‌కి పరిచయమైంది. సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఏ సినిమాలు ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ఈమె నటించిన సినిమాల్లో కేవలం వాన సినిమా మాత్రమే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో స్టార్‌గా ఎదగలేక పోయింది. సోషల్ మీడియా ద్వారా తన పాపులారిటీ పెంచుకోవడానికి ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది.

తాజాగా ఆమె ఫ్యాన్స్ తో చిన్న చిట్ చాట్ లో పాల్గొంది. అయితే ఇందులో భాగంగా అభిమాని మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగగా ప్రభాస్ అని చెప్పింది. గతంలో ఓసారి మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మహేష్ బాబు అని చెప్పిన బ్యూటీ ఇప్పుడు ప్రభాస్ అని చెప్పడంతో దీని పై ప‌లు క‌మెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఈ హీరోయిన్ ఎన్టీఆర్ ఎవరో తెలియ‌ద‌ని కామెంట్ చేసింది. టాలీవుడ్‌లో పనిచేసే ఎన్టీఆర్ ఎవరో తెలియదా? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవడంతో ఈ విషయంపై పెద్ద రచ్చ అయ్యింది. ఆమెపై ట్రోల్స్ వర్షం కురిసింది. అప్పట్లో మరో హీరోయిన్ పాయల్ ఘోష్‌ కూడా ఎన్టీఆర్‌కి సపోర్ట్‌గా మాట్లాడడంతో మరింత రాద్దాంతం జరిగింది. ఇటీవల మీరా రాజకీయాలపై కూడా కామెంట్స్ చేసింది.

బిజెపికి మద్దతుగా మీరా మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం నెల‌కొన్న అనిశ్చిత వాతావరణం, క్యాస్ట్ గొడవలకు కేవలం బిజెపి కారణం అంటూ కామెంట్స్ చేసింది మరి ఫ్రాన్స్, లండన్, ఇటలీ, స్వీడ‌న్ దేశాల్లో బిజెపి ప్రభుత్వం ఉందా..? అంటూ కొంతమంది ప్రశ్నించారు. అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇదేవిధంగా మీరా ఏ విషయంలో కామెంట్స్ చేసిన అవి సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతాయి. ఇప్పుడు హీరో విషయంలో కూడా అదే జరిగింది. ప్రభాస్‌కి ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ఉండడం వల్ల ఫేవరెట్ హీరోను మార్చేసావా.. ప్రభాస్ అని చెబుతున్నావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.