బ్లాక్ శారీలో సొగసులతో మెస్మరైజ్ చేస్తున్న పూర్ణ..!

ప్రముఖ నటి అందాల తార పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి నటిగా మారి ఢీ షో తో జడ్జిగా కూడా మారిన ఈమె ఇలా బుల్లితెర షోల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతే కాదు ఇటీవల అఖండ వంటి సినిమాలలో కూడా కీలకపాత్రలు పోషించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత చాలామంది సెలబ్రిటీలకు టీవీ , ఇంటర్నెట్లో భారీ పాపులారిటీ లభిస్తున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా సినిమాల కంటే సోషల్ మీడియా, టీవీల ద్వారానే ఇప్పుడు క్రేజ్ లభిస్తుంది. ముఖ్యంగా సినిమాలలో రాని క్రేజ్ కూడా ఇక్కడ వీరికి వస్తోంది అంటే అతిశయోక్తి కాదు. అలా పూర్ణ కూడా చాలామంది బుల్లితెర ద్వారానే భారీగా ఫాలో అవుతున్నారు. సినిమాల ద్వారా బోల్డ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న పూర్ణ కొన్ని సినిమాలలో బోల్డ్ పాత్రలలో కనిపించి అలరించింది. ఇకపోతే అవును వంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ అని చెప్పాలి.

వరుసగా అలాంటి పాత్రలే ఆమెకు లభించాయి. ఇకపోతే రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది . అందుకే ఎక్కువగా అలాంటి పాత్రలే రావడం గమనార్హం. ఇదిలా ఉండగా పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మరెక్కడ ఈమె కనిపించలేదు. బిడ్డ పుట్టిన తర్వాత మరింత బరువు పెరిగిపోయిన పూర్ణ తాజాగా బ్లాక్ శారీలో మెరిసిపోయింది. బాడీకి హత్తుకున్న ఈ సిల్క్ సారీలో తన అందాలతో మరొకసారి పిచ్చెక్కించింది. మరొకవైపు సైడ్ యాంగిల్ లో కసి గా చూపులతో టెంప్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా పూర్ణ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.