ఆ స్టార్ హీరో కి నో చెప్పిన హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్..!!

టాలీవుడ్ లో మొదట చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలలో నటిస్తోంది. ఈమెకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏమిటంటే బలగం, మసూద సినిమాలని చెప్పవచ్చు. ఈ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కొత్తగా అవకాశాలను కూడా బాగానే అందుకుంటోంది .సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తో నటించే అవకాశం వస్తే నటించనని చెప్పిందట. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు ఒక ఫంక్షన్ లో తనను చూశారట. తన కళ్ళు ఆయనకు బాగా నచ్చడంతో గంగోత్రి సినిమాలో హీరోయిన్గా చిన్నప్పటి పాత్రలో నటించమని కోరారట ..అప్పుడు తనకు ఏ విషయాలు పెద్దగా తెలియదట ..సినిమా షూటింగ్ కి ప్లే గ్రౌండ్ కి వెళ్ళినట్లు వెళ్లే దాన్ని తెలిపింది. అలా మొదలైన తన ప్రయాణం ఎన్నో చిత్రాలలో నటించేలా చేసిందని చిరంజీవి ,బాలయ్య, వెంకటేష్, పవన్ ,అల్లు అర్జున్ వంటి స్టార్లతో నటించే అవకాశం లభించింది..

పెద్దయ్యాక నాతో హీరోయిన్గా నటిస్తావా అని అల్లు అర్జున్ గంగోత్రి సినిమా సమయంలో అడిగారట.. దీంతో ఆమె అప్పటికి మీరంతా ముసలోళ్ళు అయిపోతారని చెప్పిందట..దీంతో నేను చేయనని చెప్పానని తెలిపింది కావ్య కళ్యాణ్ రామ్.. కానీ పెద్దయ్యాక అల్లు అర్జున్ అప్పటికి ఇప్పటికీ క్రేజ్ లో మార్పు వచ్చిందని ఆయన అలాగే ఉన్నారని తెలియజేస్తోంది. లాయర్ గా స్థిరపడాలనుకున్న కావ్య కరోనా సమయంలో ఇంట్లో కార్తిగా ఉన్న సమయంలో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందని ఒక ప్రయత్నం చేసి సక్సెస్ అయినట్లు తెలిపింది. అయితే కెరియర్ గురించి ఈమె డైరెక్టర్ రాఘవేంద్రరావు గారితో ముందుగా చర్చించుకుందట ఆయన సలహా మేరకే పలు పాత్రలు సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం.