బీచ్‌లో ష‌ర్ట్ విప్పేసి మ‌రీ ఎంజాయ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

బీచ్ లో ష‌ర్ట్ విప్పేసి మ‌రీ ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? యాపిల్ బ్యూటీ హ‌న్సిక అండీ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హోదాను అందుకుంది. దాదాపు అగ్ర‌హీరోలంద‌రితోనూ ఆడిపాడింది. ఇప్ప‌టికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

అలాగే హీరోయిన్ గా ఫేడౌట్ అవ్వ‌క‌ముందే హ‌న్సిక పెళ్లి పీట‌లెక్కింది. గ‌త ఏడాది చివ‌ర్లో ప్రియుడు సోహైల్ కతురియాతో హ‌న్సిక ఏడ‌డుగులు వేసింది. జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌లో హ‌న్సిక‌, సోహైల్ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత కూడా హ‌న్సిక స‌క్సెస్ ఫుల్ గా కెరీర్ ను రాణిస్తోంది.

అలాగే స్కిన్ షో విష‌యంలోనూ ఈ బ్యూటీ ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. త‌ర‌చూ చిట్టి పొట్టి బ‌ట‌ల్లో రెచ్చిపోతోంది. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో సెగ‌లు రేపింది. ప్రస్తుతం టర్కీలో ఉన్న హ‌న్సిక‌.. అక్క‌డి బీచ్ లో ష‌ర్ట్ విప్పేసి మ‌రీ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోల‌ను ఆమె సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి ఏజ్ పెరుగుతున్నా హ‌న్సిక అందం మాత్రం త‌గ్గ‌ట్లేదంటూ నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)