మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లో, ప్రేక్షకులో ఆయనకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఎన్నో ఏళ్ళ నుండి స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఎలుతున్నాడు చిరు. మధ్యలో రాజకీయాలోకి వెళ్లి ఒక పదేళ్ళు సినిమా ల నుండి బ్రేక్ తీసుకున్నాడు. ఆ తరువాత ఖైది నెంబర్ 150 అనే సినిమా తో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమా లో నటిస్తున్నాడు మెగాస్టార్.
చిరు సినిమా వస్తుంది అంటే ఓపెనింగ్స్, కటౌట్స్ భారీగా తయారుచేస్తారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక దాదాపు 5 సినిమా లో నటించి ప్రేక్షకులను అలరించాడు మెగాస్టార్ చిరంజీవి. వాళ్తేరు వీరయ్య, భోళా శంకర్, ఖైది నెంబర్ 150, గాడ్ ఫాదర్, ఆచార్య లాంటి సినిమా లో నటించాడు. వాటిలో రెండు సినిమా లు రూ. 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చెయ్యగా, మరో మూడు సినిమాలు డిసాస్టర్ గా నిలిచాయి. డిసాస్టర్ గా నిలిచిన వాటిలో రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ సినిమా కూడా ఒకటి. మొహార్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకర్శించలేకపోయింది. దాంతో నెక్స్ట్ సినిమా అయిన బ్లాక్ బస్టర్ అవ్వాలని మెగాస్టార్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే చిరు తన నెక్స్ట్ సినిమా గురించి పట్టుదలతో ఉన్నారు అనే వార్త బయటకు వచ్చింది. దాంతో మెగాస్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి తన నెక్స్ట్ సినిమాని మురుగదాస్ దర్శకత్వం లో నటించాలని అనుకుంటున్నారట. రజినీకాంత్, కమల్ హాసన్ లానే చిరు కూడా ఒక మంచి యాక్షన్ ఏంటర్టైనర్ సినిమా తో కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే చిరంజీవి సంబందించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోస్ లో చిరు ని చూస్తే 60ప్లస్ అంటే ఎవ్వరు నమ్మారు. యంగ్ హీరోలు కూడా కుళ్ళుకునేంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు చిరంజీవి ఆ ఫొటోస్ లో. ఇక ఆ ఫోటో లు చూసినా మెగాస్టార్ ఫ్యాన్స్ ‘ వావ్ బాస్ ఎంత క్యూట్ గా ఉన్నావ్ ‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.