డీజే టిల్లు నేహా కట్టిన ఈ చీర రేటు చూస్తే మైండ్ బ్లాక్ ఏ బ్లాక్..

నేహా శెట్టి డిజేటిల్లు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాతో రాధికగా పాపులారిటీ దక్కించుకుంది నేహా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నేహా ఇటీవల గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి మూవీలో విశ్వక్సేన్‌తో జతకట్టింది. ఈ సినిమాలోనే కాక ఫ్యాషన్‌లోను అదే రేంజ్ లో అదరగొట్టే నేహా శెట్టి ఇటీవల ఓ అందమైన ఎంబ్రాయిడరీ సారీతో అదరగొట్టింది.

చిన్నప్పుడే డిఫరెంట్ డిఫరెంట్ డ్రస్సులు వేసుకుంటూ ఫ్యాషన్‌పై ఆసక్తి చూపించేదాన్ని.. ఇప్పటికీ నాకు ఆ పిచ్చి పోలేదు.. ఇంకా మోడలింగ్ చేసే టైంలో ఫ్యాషన్ పై అవగాహన మరింతగా పెరగడంతో చాలా వరకు నా స్టైలింగ్ మొత్తం నేనే చూసుకుంటా.. అని చెప్తుంది ఈ బ్యూటి. ఇక ఫౌల్మీ అండ్ హర్ష సంస్థ గురించి తెలియని వారు ఉండరు. అందమైన డిజైన్లతో పలువురు సెలబ్రిటీస్‌ని ఆకట్టుకునే ఈ సంస్థ చేతితో చేసే అల్లికల వస్త్రాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది.

దీంతో వాటి డిజైనింగ్ కాస్త లేట్ అయినప్పటికీ సెలబ్రిటీస్ నీ ఆకట్టుకుంటుంది. భారత్ తో పాటు అమెరికా నుంచి కూడా ఆర్డర్లు తీసుకుంటున్న ఈ సంస్థ దరకాస్త‌ ఎక్కువైనా ఆన్లైన్లో కొలుగోలు చేసే అవకాశాన్ని అందించింది. ఇక నేహా శెట్టి ఇటీవల ధరించిన అల్లికల చీర కూడా పౌల్మి అండ్ హర్ష బ్రాండ్ నుంచి వచ్చినదే. ఈ సారి లో నేహా శెట్టి చాలా అందంగా కనిపించడంతో ఎంతో మంది నెటిజ‌న్స్ దీని కాస్ట్ తెలుసుకోవాలని ఆసక్తితో సెర్చ్ చేశారు. ఇక దీని ధర తెలిసి మైండ్ బ్లాక్ అయింది. ఈ చీర అక్షరాల రూ.42,800 అట. దీంతో ఈసారి అంత ఖ‌రీదా అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు.