మహేష్ కు ఫ్రెండ్ గా నటించిన ఈ ప్లాఫ్ డైరెక్టర్ ఎవరో తెలుసా ..ఎవరు ఊహించరు..!?

ప్రస్తుతం సోషల్ మీడియాలో దర్శకుడు మెహర్ రమేష్ పేరు ఏ విధంగా వైరల్ గా మారుతుందో అందరికి తెలిసిన భోళాశంకర్ సినిమాతో ఆయన ప్రేక్షకులముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా దారుణంగా ప్లాప్ అయిందని చెప్పాలి. అదేవిధంగా మెహ‌ర్ ర‌మేష్‌ ఇప్ప‌టివ‌రకు చేసిన‌ సినిమాలన్నీ ఇదేవిధంగా ప్లాప్ అవుతూ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి కి వరసకు త‌మ్ముడు అయ్యే ఈయన మెగా ఫ్యామిలీ ఆశీస్సులతోనే నటుడుగా ప్రయత్నించాడు.

ఇక అదే సమయంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన బాబీ సినిమాలో సునీల్, హీరో మహేష్ స్నేహితుడు పాత్రలో మెహర్ రమేష్ నటించాడు. ఆయన డైరెక్టర్ కాకముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ విధంగా ముందుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు నటుడుగా ఎంట్రీ ఇచ్చిన మెహర్ రమేష్ ఆ తర్వాత పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. పునీత్ రాజ్ కుమార్ తో పూరి సినిమా చేయాల్సి వచ్చింది. అదే స‌మ‌యంలో తెలుగులో కూడా పూరి, ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

ఆ సమయంలోనే కన్నడ సినిమా చేయలేక మహార్ రమేష్ కు ఆ సినిమా బాధ్యత అప్పగించగా అక్కడ ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తెలుగులో వచ్చిన ఒక్కడు సినిమాను కన్నడలో అజయ్ అంటూ పునీత్ రాజ్ కుమార్ తో మరో సినిమా చేసి అక్కడ మరో విజయం అందుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో మెహర్ రమేష్ కంత్రి, శ‌క్తి, షాడో వంటి సినిమాలు చేసి భారీ ప్లాప్‌ల‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాల తర్వాత దాదాపు పది సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకుని భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆయన దరిద్రం వెంటాడుతూనే వచ్చింది.