రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలను చేతులారా వదులుకున్న నాగార్జున.. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటంటే..!?

ఇక చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇలాంటి సంఘటనే టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున సినీ కెరీర్ లో కూడా జరిగింది. నాగార్జున చేతులారా రెండు ఇండస్ట్రీ హిట్‌ సినిమాలను వదులుకున్నారు. అలా నాగార్జున వదులుకున్న ఆ రెండు సినిమాలు ఏమిటి..? వాటిలో నటించిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

ముందుగా విక్టరీ వెంకటేష్- సిమ్రాన్ జంటగా నటించిన సినిమా కలిసుందాం రా.. ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వెంకటేష్ అన్న సురేష్ బాబు స్వయంగా నిర్మించారు. 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా లవ్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వ‌చ్చి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్ల వర్షం కురిపించింది.

అయితే నిజానికి ముందుగా ఈ సినిమాను నాగార్జున చేయాల్సి ఉందట. ముందుగా దర్శకుడు ఉదయ్ భాస్కర్ కలిసుందాం రా కథను నాగార్జునకే చెప్పారట. అప్పటికే నాగ్ ఫ్యామిలీ సినిమాలు వరుసగా చేస్తూ ఉండటంతో ఆ కథను రిజెక్ట్ చేశాడట. అలా నాగార్జున నుంచి కలిసుందాం రా సినిమా వెంకటేష్ చేతిలోకి వచ్చి ఆయనకు మంచి హిట్ సినిమాగా నిలిచింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కెరిర్లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలలో గ్యాంగ్ లీడర్ కూడా ఒకటి.

సీనియర్ దర్శ‌కుడు విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరుకు జంటగా విజయశాంతి నటించింది. 1991 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకి కూడా మొదటి ఛాయిస్ చిరంజీవి కాదట నాగార్జున ఆట.. కానీ కొన్ని అనుకోని కారణాల చేత ఆయన ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా నాగార్జున తన కెరీర్లో రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలను కోల్పోయాడు.