గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

రెండు దశాబ్దాల క్రితం నాగార్జున హీరోగా తెరకెక్కిన మన్మధుడు సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది హీరోయిన్ అన్షు. త్రివిక్రమ్ కధా, మాటలా అందించిన ఈ సినిమాలో విజయభాస్కర్ దర్శకత్వం వహించాడు. సోనాలి బింద్రే తో పాటు మరో హీరోయిన్గా అన్షు నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తరువాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ అవకాశాన్ని సంపాదించుకుంది. ప్రభాస్ స‌ర‌స‌న నటించిన ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక ఈ రెండు సినిమాల‌లో చనిపోయే హీరోయిన్ పాత్రలో ఈమె నటించింది.

కారణం తెలియదు కానీ తర్వాత టాలీవుడ్కు దూరమైంది అన్షు. మన్మధుడు సినిమాతో కావలసినంత గుర్తింపు తెచ్చుకోవడంతో తర్వాత కూడా ఈమె గురించి చాలామంది టాప్ డైరెక్టర్‌లు, హీరోలు ఆరా తీశారు. ఎక్కడుందో.. ఏం చేస్తుందో.. అనే విషయం కూడా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ మెయింటెన్ చేసింది అన్షు. కొన్ని కన్నడ సినిమాలో నటించిన తర్వాత లండన్‌కి వెళ్ళిపోయింది. అక్కడే పుట్టి పెరిగిన ఈమె ఓ అతిథిలా ఇండస్ట్రీకి వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. వెంటనే రెండు, మూడు సినిమాలు చేసి చదువుకోవడానికి మళ్లీ లండన్‌కి వెళ్ళిపోయింది.

అక్కడే ఉండి చదువు పూర్తి చేసిన ఆమె.. తన సొంత దేశం లోనే సెటిల్ అయిపోయింది. లండన్ టాప్ బిజినెస్ మాన్ సచిన్ సర్గర్‌ని వివాహం చేసుకొని ఓ పాపకు జన్మనిచ్చింది. అంతే కాదు తన తెలివితేటలతో ఫ్యాషన్ డిజైనర్‌గా సంచలనం సృష్టిస్తుంది అన్షు. ఈమెకు లండ‌న్‌ల్లో ఇన్స్పిరేషన్ కౌచ‌ర్ అనే డిజైనింగ్ షాప్ కూడా ఉందట. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు వేసుకునే దుస్తులను అక్కడ డూప్లికేట్ చేసి అమ్మకాలు చేస్తారని సమాచారం. ప్రస్తుతం లండన్ లో సెటిల్ అయినా అన్షు చేసింది రెండు, మూడు సినిమాలు అయినా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది, అదేవిధంగా ఇండస్ట్రీలో కొనసాగి ఉంటే స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకునేది. అయితే ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయింది ఈ బ్యూటీ.