అమ్మ బాబోయ్‌.. యాంక‌ర్ ప్ర‌దీప్ ఒక్క రోజుకే అంత సంపాదిస్తాడా..?

తెలుగులో మోస్ట్ స్టైలిష్, హ్యాండ్సం అండ్ టాలెంటెడ్ యాంకర్ల లిస్ట్ తీస్తే అందులో ప్ర‌దీప్ మాచిరాజు పేరు మొదటి స్థానంలో ఉంటుంది. మెయిల్ యాంకర్స్ లో టాప్ 1గా దూసుకుపోతున్న ప్రదీప్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఫాలోయింగ్ గా ఉంది అన‌డంలో సందేమం లేదు. ఆర్జేగా కెరీర్‌ను ప్రారంభించిన ప్రదీప్.. తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు.

మరోపక్క యాంకర్‌గా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. త‌న స‌త్తా ఏంటో అంద‌రినీ చూపించాడు. ప్ర‌దీప్ యాంక‌రింగ్ తో హిట్ అయిన షోలు ఎన్నో ఉన్నాయి. అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ప్ర‌దీప్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత హీరోగా మ‌రో సినిమా చేయ‌క‌పోయినా.. బుల్లితెర‌పై మాత్రం అనేక షోల‌తో ఫుల్ బిజీగా గ‌డుపుతున్నాడు.

అప్పుడ‌ప్పుడు సినిమా ఈవెంట్స్ కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే నెల‌లో నాలుగైదు రోజులు త‌ప్పితే మిగతా డేస్ అంతా బిజీగా ఉండే ప్ర‌దీప్‌.. ఒక్క రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా అక్ష‌రాలు రూ. 3 ల‌క్ష‌లు. ఒక్క రోజు ప్ర‌దీప్ షూటింగ్ లో పాల్గొన్నాడు అంటే.. ఖ‌చ్చితంగా ఆయ‌న‌కు రూ. 3 ల‌క్ష‌లు పే చేయాల్సిందే అట‌. మ‌రోవైపు షాపింగ్ మాల్ ఒపెనింగ్స్‌, బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ ద్వారా ప్ర‌దీన్ భారీగానే అర్జిస్తున్నాడు. ఈయ‌న నెల సంపాద‌న దాదాపుగా రూ. 2 కోట్ల రేంజ్ లో ఉంటుంద‌ని టాక్‌.