హీరో అజిత్ కూతురును ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్లు కూడా కుల్లుకోవాల్సిందే!

అజిత్ కుమార్‌.. నిజానికి సికింద్రాబాద్ లో పుట్టి పెరిగినా, ఈయ‌న కెరీర్ మాత్రం కోలీవుడ్ లో స్టార్ట్ చేశాడు. ప‌రాయి గ‌డ్డ‌పై ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అత‌టి ఇమేజ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకడు. చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తి.. అయినా కూడా అనేక భాష‌ల‌ను అనర్గళంగా మాట్లాడ‌తాడు.

అలాగే జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. కెరీర్ పిక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే అజిత్ ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని ప్రేమించి 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. వివాహం అనంత‌రం షాలిని సినిమాలు మానేసి.. గృహిణిగా మారింది. ఈ దంప‌తులు కూతురు అనౌష్క, కొడుకు ఆద్విక్ జ‌న్మించారు.

ఎంత పెద్ద స్టార్ అయినా.. అజిత్ చాలా సింపుల్ గా ఉంటారు. ఫ్యామిలీకి అధిక ప్రాధాన్య‌త ఇస్తాడు. త‌ర‌చూ భార్య పిల్ల‌ల‌తో వెకేష‌న్స్ కు వెళ్తుంటాడు. ఫెస్టివ‌ల్స్‌, బ‌ర్త్‌డేస్‌, స్పెష‌ల్ డేస్ ను అస్స‌లు మిస్ అవ్వ‌డు. అలాగే మీడియాకి మ‌రియు సోష‌ల్ మీడియాకు త‌న ఫ్యామిలీని అజిల్ ఎప్పుడూ దూరంగా ఉంచుతాడు. ఇక‌పోతే అజిత్ కూతురు అనౌష్క‌ను ఎప్పుడైనా చూశాడు. హీరోయిన్లు కూడా కుల్లుకునే అందం ఆమెది. త‌ల్లిని కూడా బీట్ చేసేసింది. అనౌష్క వ‌య‌సు 15. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్న అనౌష్క‌కు సినిమాల‌పై ఇంట్రెస్ట్ ఉందా.. లేదా.. అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికైతే ఆమె పిక్స్ పై ఓ లుక్కేసేయండి.