క్యూట్‌గా ఫోటోకు పోజులిస్తున ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గెస్ చేస్తే మీరు జీనియ‌స్‌!

పైన క్యూట్ గా ఫోటోకు పోజులిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ఆమె ఒక స్టార్ హీరోయిన్‌. ఆ చిన్నారి తండ్రి కూడా ఓ స్టార్ హీరోనే. స్టార్ కిడ్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. స్టార్డ‌మ్ ను సొంతం చేసుకుని.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతోంది. ఆమె ఎవ‌రు గెస్ చేశారా.. పటౌడీ క్వీన్ సారా అలీ ఖాన్.

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు అయిన సారా బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆమెకు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్, అతని మొదటి భార్య అమృతా సింగ్ సంతాన‌మే సారా. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత సారా 2018లో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన కేదార్‌నాథ్ చిత్రంతో న‌ట‌నా జీవితాన్ని ప్రారంభించింది. తొలి సినిమాతో హిట్ అందుకుంది.

అందం, అభిన‌యంతో పాటు న‌ట‌న‌తో సారా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. త‌క్కువ స‌మ‌యంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల చెంత చేరింది. రీసెంట్ గా సారా `జరా హాట్కే జరా బచ్కే` మూవీతో సూప‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ అందాల భామ దాదాపు నాలుగు చిత్రాల‌తో బిజీగా గ‌డుపుతోంది. ఈ ప్రాజెక్ట్ ల‌న్నీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. ఇక నేడు సారా బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఆమెకు అభిమానులు మ‌రియు సినీ ప్రియులు సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ తెల‌పుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)