సీతారామం సినిమాకి అదిరిపోయే అవార్డు.. మృణాల్‌కు ప్రత్యేక గౌరవం…

వెండితెరపై ఎన్నో ప్రేమ కథలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంటాయి. కొన్ని ప్రేమకథలు ఆడియన్స్ కి వినోదాన్ని కలిగిస్తే మరికొన్ని ప్రేమ కథలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. అయితే మరికొన్ని ప్రేమకథలు  మాత్రం ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. అలా ప్రేక్షకులం హృదయాల్లో ముద్ర వేసుకున్న ప్రేమ కథ సినిమాల్లో ‘సీతారామం’ సినిమా కూడా ఒకటి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘ సీతారామం ‘ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించిన విషయం అందరికీ తెలిసిందే.


ఈ సినిమాలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్
, బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. అలానే రష్మిక,  ప్రకాష్ రాజ్, గౌతమ్ మినన్, సుమంత్, భూమిక కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాలోని ప్రతి ఒక్క సీన్ ప్రేక్షకుల మనసును తాకేల ఉంటాయి. ఇక సీతారామం సినిమాకు సంగీతం మరో హైలెట్ అనే చెప్పాలి. తాజాగా సీతా రామం సినిమా కి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫీలింగ్ ఫెస్టివల్ మెల్ బోర్న్ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా సీతారామం సినిమా నిలిచింది.

మెల్ బోర్న్ వేదికంగా ప్రారంభమైన  ఈ వేడుకలు ఆగస్టు 20 వరకూ జరుగుతాయి. బెస్ట్ బెస్ట్ మూవీలో సీతారామం సినిమా అవార్డు దక్కించుకోవడంతో ఆ చిత్రం బృందం సంతోషం వ్యక్తం చేస్తుంది. అలానే వెబ్ సిరీస్ విభాగాల్లో బెస్ట్ సిరీస్ గా ‘జూబ్లీ ‘ ఉండగా, ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ టు కిల్ ఏ టైగర్ ‘ నిలిచింది. అంతేకాకుండా ‘మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వేల్ ‘ సినిమా లో తన నటనతో సత్తా చాట్టుకొని బెస్ట్ ఫిమేల్ యాక్టర్ గా రాణి ముఖర్జీ అవార్డు అందుకుంది. ఇక సీతారామం సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూ డైవర్సిటీ అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డు మోహిత్ అగర్వాల్ కి రాగా, పీపుల్స్ ఛాయస్ అవార్డు ‘పఠాన్’ సినిమా కి వచ్చింది.