అందాల భామ మెహ్రీన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ మూవీతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను దక్కించుకుంది.
అయితే కెరీర్ పీక్స్ లోకి వెళ్తున్న సమయంలో మెహ్రీన్.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కూడా సిద్ధమైన ఈ జంట.. గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ, పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోయారు. అయితే భవ్య బిష్ణోయ్‌తో విడిపోయిన తర్వాత మెహ్రీన్.. కెరీర్ పరంగా మునుపటి జోరును చూపించలేకపోయింది.
ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి. దీంతో సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ పిక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా.. పెద్దగా ఫలితం దక్కట్లేదు. పైగా రోజురోజుకు ఈ బ్యూటీ దుస్తుల సైజ్ తగ్గించేస్తూ.. ఫోటోషూట్లు చేస్తోంది. అయినా కూడా ఏ ఒక్కడు పట్టించుకోవట్లేదు. తాజాగా కూడా మినీ టాప్ అండ్ షార్ట్ ధరించి మెహ్రీన్ టూ మచ్ హాట్ షో చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మెహ్రీన్ చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. అదే స్పార్క్. ఈ మూవీతో విక్రాంత్ హీరోగా పరిచయం అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Mehreen Pirzada pic.twitter.com/oINI9UHHpL
— 𝙏 𝙒 𝙀 𝙀 𝙏 𝘽 𝙊 𝙔 🕊️𝕏 (@iamtweetboy) August 8, 2023