ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్‌…!

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ సినిమాకు సిక్కుల్ గా పుష్పది రూల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో పుష్ప లాంటి భారీ విజయం తర్వాత బన్నీకి బాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫ‌ర్లు వస్తున్నాయి. కానీ తన సినిమాలు విషయంలో మాత్రం బన్నీ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో అవకాశం వచ్చిన బన్నీ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇప్పుడూ మరో భారీ సినిమాను కూడా అల్లు అర్జున్ రిజెక్ట్ చేశాడు. ముందుగా ఆ సినిమా ఆఫర్ వ‌చ్చినందుకు ఎంతో ఆసక్తిగా ఉన్న.. ఆ తర్వాత పాత్రలో నటించేందుకు బన్నీ కొంత సమయం కూడా తీసుకున్నాడట. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉండటం ఒక కారణమైతే ఆ సినిమాలో బన్నీ క్యారెక్టర్ కూడా ఆశ్వ‌థ్థామ అనే ఇతిహాసం కథలోని పాత్రను తెరపై చూపించడం అంటే అది పెద్ద సాహసం అని అదేవిధంగా ఆ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందని బన్నీ ఆలోచించాడట.

అదేవిధంగా ఈ సినిమా మొత్తం గ్రాఫిక్స్ ఆధారంగానేే తెర్కెక్కించేయనున్నారని.. ఇప్పటికే గ్రాఫిక్స్ ఆధారంగా వచ్చిన బాలీవుడ్ ప‌లు సినిమాలు ప్లాప్ అవడంతో బన్నీ కూడా కొంత ఆలోచించి ఆ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఇక ఈ విధంగా బాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాలను వదులుకొని తనకు బ్యాక్ టు బ్యాక్ విజయాలు ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ తోనే తన తర్వాత సినిమా చేయడానికి బన్నీ రెడీ అయ్యాడు.