యవ్వనంగా ఉండటానికి తన గ్లామర్ సీక్రెట్ ఏంటో రివీల్ చేసిన చిరంజీవి…

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అరవై సంవత్సరాల వయసులో కూడా ఎంత యంగ్ గా కనిపిస్తాడో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఆయన డాన్స్ స్టెప్పులతో అందరిని అల్లరిస్తూ ఉంటారు. మెగాస్టార్ వయసు లానే అయనకున్న క్రేజ్ పాపులారిటీ కూడా పెరుగుతూ పోతుంది. ఇక తన మనవరాలు క్లిన్కారా
బారసాల వేడుకలో చిరంజీవి లుక్ చూసి యంగ్ హీరోలు కూడా కుళ్ళకుంటున్నారు.

ఇక తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా లో ఆయన లుక్ అదిరిపోయింది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయన హ్యాండ్సమ్ లుక్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో ఇటీవల జరిగిన భోళా శంకర్ ప్రమోషన్స్ లో చిరు తెలిపారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ ఆడియన్స్ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇక ఆడియన్స్ తరువాత నేను ఎక్కువగా ప్రొడ్యూసర్స్ కి, దర్శకులకు ప్రాధాన్యత ఇస్తాను.’ అని చెప్పుకొచ్చారు.

 

‘ నేను ఫైట్ చేసిన, సీన్ చేసిన, సాంగ్ చేసిన ప్రేక్షకుల రియాక్షన్ గురించి ఆలోచిస్తాను. ఆడియన్స్ చప్పట్లు కొడతారని 2 అడుగుల బంగీ జంప్ చేసాను. ఇక భోళా శంకర్ సినిమా లో ఒక పాటలో నేను, తమన్నా మెరిసిపోతున్నాం అని చాలా మంది అన్నారు. తమన్న కి సమానంగా గ్లామరస్ గా ఉన్నాను అంజి అంటున్నారు. నా గ్లామర్ వెనుక ఉన్న రహస్యం ప్రేక్షకులు నాకిచ్చిన ఎనర్జీ నే ‘ అని ఈ సందర్బంగా గా చిరు చెప్పుకొచ్చారు. అలానే భోళా శంకర్ సినిమాలో పవన్ కళ్యణ్ ని ఇమిటేట్ చేసే సీన్స్ లో శ్రీముఖి కూడా నటించిందని చిరు చెప్పారు. రోజురోజుకి భోళా శంకర్ సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి.