మెగా ఇంటికి అల్లుడు కాబోతున్న త‌రుణ్‌.. స్వ‌యంగా క్లారిటీ ఇచ్చిన మాజీ ల‌వర్ బాయ్‌!

ఒక‌ప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన మాజీ ల‌వర్ బాయ్ త‌రుణ్ నాలుగు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. త‌రుణ్ పెళ్లి కోసం ఆయ‌న అభిమానులు గ‌త ప‌దేళ్ల నుంచి క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూసుకున్నారు. కానీ, ఆ త‌రుణం మాత్రం రావ‌డం లేదు. మ‌రోవైపు త‌రుణ్ పెళ్లిపై త‌ర‌చూ ఏదో ఒక పుకారు నెట్టింట షికారు చేస్తూనే ఉంటుంది.

గ‌త రెండు రోజుల నుంచి త‌రుణ్ పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ వైర‌ల్ గా మారింది. త‌రుణ్ త్వ‌ర‌లోనే మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడ‌ని.. ఇటీవ‌ల‌ భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డకు విడాకులు ఇచ్చేసిన మెగా డాట‌ర్ నిహారిక‌ను పెళ్లాడ‌బోతున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ విష‌యంపై త‌రుణ్ స్వ‌యంగా క్లారిటీ ఇచ్చాడు.

తన పెళ్లి గురించి వస్తున్న వార్త నిజం కాద‌ని తేల్చి చెప్పాడు. నిజంగా ఏదైనా గుడ్‌న్యూస్ ఉంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా చెబుతానని, ద‌య‌చేసి తన పెళ్లి విషయంలో ఇలాంటి పుకార్లు సృష్టించ‌వ‌ద్ద‌ని త‌రుణ్ విజ్ఞ‌ప్తి చేశాడు. దీంతో నిహారిక‌తో త‌రుణ్ పెళ్లి అన్న వార్త పుకారే అని తేలిపోయింది. కాగా, చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ చేసి.. ఆ త‌ర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు త‌రుణ్‌. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్డ‌మ్ ను సొంతం చేసుకున్నాడు. కానీ, అంత త్వ‌ర‌గా ఫేడౌట్ హీరోల జాబితాలో చేరాడు. ప్ర‌స్తుతం త‌రుణ్ వ్యాపార‌రంగంలో స‌త్తా చాటుతున్నాడు.