పుష్ప-2 రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో పుష్ప సినిమా కూడా ఒకటి.. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ రష్మిక పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించారు. డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా సీక్వెల్ ను సుకుమార్ కూడా మరింత అద్భుతంగా తెరకెక్కించే పనిలో పడ్డారు. సౌత్ ప్రేక్షకుల కంటే నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా మరింత ఆసక్తిని పెంచేసింది ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా జరగడంతో మంచి పాపులారిటీ అందుకుంది.

Pushpa 2: All eyes on Allu Arjun's saree look, fans say 'brilliant already'  - Pushpa 2: All eyes on Allu Arjun's saree look, fans say 'brilliant  already' -

పుష్ప-2 సినిమా పైన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా అసలు ఇప్పటివరకు ఎందుకు పూర్తి అయిందనే విషయం ఇంకా బయటికి రాలేదు.ఏడాది స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50% పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే యేడాది ఈ సినిమా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. అందుకోసమే ఈ సినిమా షూటింగ్ కూడా త్వర త్వరగా పూర్తి చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

పుష్ప -2 షూటింగ్ ఎంత పూర్తి అయింది అనే సమాచారం పై ఇంకా క్లారిటీ రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఉన్నారు. అనసూయ ,సునీల్, ఫహద్ ఫజిల్ నటిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయగా మంచి పాపులారిటీ అందుకుంది. మరి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.