పరిటాల ఫ్యామిలీకి మళ్ళీ లక్ లేదా? రెండు పోతాయా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దివంగత పరిటాల రవీంద్ర అనంతలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన మరణం తర్వాత సునీతమ్మ సత్తా చాటారు. కానీ పరిటాల వారసుడు శ్రీరామ్ విజయాలని కొనసాగించలేకపోయారు. తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో రాప్తాడు బరిలో దిగి ఓడిపోయారు.

తర్వాత పరిటాల ఫ్యామిలీకి చంద్రబాబు రెండు సీట్ల బాధ్యతలు ఇచ్చారు. సునీతమ్మకు రాప్తాడు, శ్రీరామ్‌కు ధర్మవరం బాధ్యతలు ఇచ్చారు. దాదాపు వీరి సీట్లు ఖాయమే. మరి వీరికి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయంటే? ప్రస్తుతానికి గెలుపు అవకాశాలు కనిపించడం లేదు. రెండు చోట్ల వైసీపీకే ఆధిక్యం ఉందని సర్వేల్లో తేలింది. కొద్దో గొప్పో రాప్తాడులో కాస్త పోటీ ఇవ్వవచ్చు అని తేలింది. ధర్మవరంలో మాత్రం వైసీపీ హవా ఉంది.

రాప్తాడు బరిలో గెలిచిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి..ఈ సారి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆయన స్వల్ప ఆధిక్యంలోనే ఉన్నారు. సునీతమ్మ కాస్త కష్టపడితే రాప్తాడు దక్కించుకోవచ్చు. ఇటు ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. పరిటాల శ్రీరామ్ ఎంత కష్టపడిన ఇక్కడ వైసీపీని ఓడించడం కష్టమని తేలింది. ఒకవేళ పరిటాల ఫ్యామిలీకి ఒకటే సీటు ఇస్తే శ్రీరామ్..రాప్తాడు బరిలో పోటీ చేసే ఛాన్స్ ఉంది.

రెండు సీట్లు ఇస్తే మాత్రం రాప్తాడు, ధర్మవరం బరిలో సునీతమ్మ, శ్రీరామ్ పోటీ చేస్తారు. అయితే ఇద్దరికి గెలుపు డౌటే. మరి ఎన్నికల సమయానికి ఏమైనా లక్ మారుతుందేమో చూడాలి.