ఖరీదైన ఇంటిని కొన్న నటి..ఎన్ని కోట్లో తెలుసా?

ఒక సెలెబ్రెటీ ఇల్లు లేదా కార్ ని కొంటె అందరు ఎంత పెట్టి కొన్నారో అంటూ అంచనాలు వేసేసుకుంటరు. ఒక హీరోయిన్ కోట్లు ఖర్చు పెట్టు ఇల్లు కొంటె సోషల్ మీడియాలో ఆ ఇంటి ఫోటోలు వైరల్ కావాల్సిందే. తాజగా ఒక హీరోయిన్ ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసి ఒక ఇంటిని కొనిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఇంటిని ఒకరు తనకి కానుకగా ఇచ్చారని చెప్పడంతో అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో కాదు జాక్వెలిన్ ఫెర్నాండిస్. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది సెలెబ్రెటీల పేర్లు కూడా ఆయన బయటికి తీసుకొచ్చారు.

తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండిస్ ఒక ఇల్లు కొన్నారు. ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన ప్రాంతంలో కొనింది. ఈ ప్రాంతంలోనే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్,సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్ లు కూడా ఇక్కడే నివసిస్తున్నారు. ఇక్కడ 3 BHK ఫ్లాట్ కొనుగోలు చేయాలి అంటే 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం. జాక్వెలిన్ ఇదే ప్రాంతంలో 20 కోట్లు ఖర్చు చేసి ఇల్లు కొనిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఇంటిని స్వయంగా సుఖేష్ చంద్రశేఖర్ కానుకగా ఇచ్చారనే వార్తలు మరింత హీట్ పెంచాయి.

కొందరు ఈ గిఫ్ట్ సుకేష్ ఇచ్చారా లేక సల్మాన్ ఇచ్చారా అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. జాక్వెలిన్ తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో క్షణాల్లోనే నెట్టింట హల్ చల్ చేసింది. సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యాక జాక్వెలిన్ ఫెర్నాండిస్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇంటి విషయం కూడా వైరల్ అవుతుంది.