రఫ్ఫా డిస్తున్న బోయపాటి- రామ్ స్కంద గ్లింప్స్..!!

బోయపాటి శ్రీను ,రామ్ పోతినేని కాంబినేషన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్స్ని కూడా వేగవంతం చేస్తోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకొని మరింత హైపున పెంచేస్తోంది. రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

Ram Pothineni and Boyapati Sreenu's film titled 'Skanda'; title glimpse  unveiled | Telugu Movie News - Times of India

సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. హీరో రామ్ కెరియర్లో మొదటిసారి పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను ఆ తర్వాత మరే సినిమాను తెరకెక్కించలేదు. కేవలం హీరో రామ్ తో సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో హీరో రామ్ మాస్ అండ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.

 

భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నట్లు ఈ సినిమా గ్లింప్స్ ద్వారా చెప్పవచ్చు.. రామ్ చెప్పే డైలాగ్” మీరు దిగితే ఊరు ఏదైతే ఉండదు నేను దిగితే మిగిలేది ఉండదు” అంటూ రామ్ చెప్పే డైలాగ్ అదిరిపోయేలా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అద్భుతంగా అందించారు. ఊహించినట్టుగానే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు చిత్ర బృందం ఈ సినిమాకి స్కంద అనే టైటిల్ ని తెలియజేయడం జరిగింది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 15న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ వైరల్ గా మారుతోంది.