8 సినిమాలు చేతిలో ఉన్నా ఆ విష‌యంలో మాత్రం శ్రీ‌లీల వేస్టేనా..?

టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రెండేళ్ల‌కే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల ఒక సెన్సేష‌న్ గా మారింది. ఇటు యంగ్ హీరోల‌తో పాటు అటు స్టార్ హీరోల‌కు సైతం మోస్ట్ వాంటెడ్ అయింది. పాతికేళ్లు కూడా లేని ఈ ముద్దుగుమ్మ‌.. అగ్ర‌హీరోయిన్ల‌కు సైతం ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ప్ర‌స్తుతం శ్రీ‌లీల చేతిలో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది చిత్రాలు ఉన్నాయి.

మ‌హేష్ బాబు గుంటూరు కారం, బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, రామ్ పోతినేని స్కంద‌, వైష్ణ‌వ్ తేజ్ ఆది కేశవ వంటి చాత్రాలు శ్రీ‌లీల లిస్ట్ లో ఉన్నాయి. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా, న‌వీన్ పొలిశెట్టితో ఓ సినిమా, నితిన్ తో ఓ సినిమాకు శ్రీ‌లీల క‌మిట్ అయింది. మొత్తానికి చేతినిండా ప్రాజెక్ట్ ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న శ్రీ‌లీల‌.. ఒక్క విష‌యంలో మాత్రం వెన‌క‌బ‌డిపోయింది.

అది మ‌రేదో కాదు.. సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్. ఇన్ స్టా గ్రామ్ లో ఈ ముద్దుగుమ్మకు 2.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ట్వీట్టర్ లో 59కే ఫాలోవ‌ర్స్ మాత్ర‌మే ఉన్నారు. స‌మంత‌, ర‌ష్మిక‌, పూజా హెగ్డే వంటి వారు సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటూ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఇర‌వై, ముప్పై మిల‌య‌న్ల ఫాలోవ‌ర్స్ ను సంపాదించుకున్నారు. కానీ, ఈ విష‌యంలో శ్రీ‌లీల మాత్రం వేస్ట్ అని అనేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికే ఇది గ్ర‌హించి శ్రీ‌లీల సోష‌ల్ మీడియాలో త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తుందో లేదో చూడాలి.