నితిన్‏కు అంత సీన్ లేదు.. హీరోగారి ప‌రువు మొత్తం తీసేసిన మాజీ ఎమ్మెల్సీ!

హీరో నితిన్ గురించి ఓ న్యూస్ గ‌త రెండు రోజుల నుంచి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. నితిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాద్ కు చెందిన రూరల్ నియోజకవర్గం నుంచి నితిన్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్న‌దే ఆ వార్త సారాంశం.

ఓవైపు రాజ‌కీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. మ‌రోవైపు సినిమాల్లో న‌టిస్తూ అభిమానుల‌ను అల‌రించాల‌ని నితిన్ నిర్ణ‌యించుకున్నాడంటూ కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి త‌రుణంలో నితిన్‏కు అంత సీన్ లేదంటూ ఆయ‌న ప‌రువు మొత్తం తీసేశారు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి. నితిన్ పొలిటిక‌ల్ ఎంట్రీపై తాజాగా అరికెల నర్సారెడ్డి స్పందించారు.

హీరో నితిన్‏కు అంత సీన్ లేదు. అతను కాంగ్రెస్ పార్టీలో చేరాడు అన్న‌ది అవాస్తవం. ఇవి సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న స్టెంట్స్‏లా ఉన్నాయి. అవి సినిమాల్లో పని చేస్తాయి తప్ప రాజకీయాల్లో కాదు. నితిన్ పొలిటిక‌ల్ ఎంట్రీ ప్ర‌చారాన్ని అంత సీరియస్‏గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఉన్న వారికే రాజకీయాలు వర్కవుట్ అవుతాయి. రూరల్‏లో ప్రజల్లో ఉన్న వారికే ప్రజలు పట్టం కడుతారు. ` అంటూ అరికెల నర్సారెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, నితిన్ ప్ర‌స్తుతం వ‌క్కంతం వంశీ తో ఓ సినిమా, వెంకీ కుడుములతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ ద‌శలోనే ఉన్నాయి.