చిన్న సినిమాగా వచ్చిన శ్రీవిష్ణు `సామజవరగమన` పెద్ద విజయం సాధించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణుకు జోడీగా రెబా మోనికా జాన్ నటించింది. అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలైన మూడో రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన సామజవరగమన.. నాలుగో రోజు నుంచి భారీ లాభాలతో దూసుకుపోతోంది.
తాజాగా పది రోజులు థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ. 7.12 కోట్ల షేర్, రూ. 13.05 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ.10.37 కోట్ల షేర్, రూ. 20.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. రూ. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. ఏకంగా రూ. 6.87 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం రేపింది.
అంతేకాదు, ఓవర్సీస్ లో కూడా సామజవరగమన సత్తా చాటుతోంది. అక్కడ కేవలం రూ. 25 లక్షలకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారు. అయితే రెండవ వీకెండ్ లోకి అడుగుపెట్టేలోపు ఈ సినిమా రెండు కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. పైగా ఓవర్సీస్ లో శ్రీవిష్ణు ఏకంగా పవన్ కళ్యాణ్ రికార్డుకే ఎసరు పెడుతున్నాడు. కరోనా పీక్ టైమ్ లో విడుదలైన పవన్ కళ్యాణ్ `వకీల్ సాబ్` అప్పట్లో అమెరికా లో 7 లక్షల 80 వేల డాలర్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా వసూళ్లను సామజవరగమన క్రాస్ చేయబోతోంది. ఆల్రెడీ శ్రీవిష్ణు మూవీకి ఆమెరికాలో 7 లక్షల 20 వేల డాలర్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 8 లక్షల రూపాయలకు పైగా డాలర్స్ ని రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.