మీరు `గే`నా? అంటూ ప్ర‌శ్నించిన నెటిజ‌న్‌.. ఫ్యూజులు ఎగిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చిన క‌ర‌ణ్ జోహార్‌!

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినీ ప్రియులంద‌రికీ ఈయ‌న సుప‌రిచిత‌మే. త‌న సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ కిడ్స్ ను లాంచ్ చేసిన ఘ‌న‌త క‌ర‌ణ్ జోహార్‌కే సొంతం. అలాగే ఈయన హోస్ట్ గా వ్య‌వ‌హరించే `కాఫీ విత్ క‌ర‌ణ్‌` టాక్ షో కూడా బాగా పాపుల‌ర్ అయింది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. క‌ర‌ణ్ జోహార్ పై ఓ వాద‌న ఉంది. అత‌ను గే అని కొంద‌రు చెబుతుంటారు. తాజాగా ఇదే విష‌యంపై క‌ర‌ణ్ జోహార్ కు ఓ ప్ర‌శ్న ఎదురైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర‌ణ్ జోహార్ ట్విట్ట‌ర్ కు పోటీగా వ‌చ్చిన థ్రెడ్స్ యాప్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఫ్యాన్స్ తో కాసేపు చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ సెష‌న్ లో ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు క‌ర‌ణ్ స‌మాధానాలు ఇచ్చాడు.

ఈ క్ర‌మంలోనే ఓ వ్య‌క్తి మీరు గే(స్వలింగ సంపర్కుల)నా? అంటూ ప్ర‌శ్నించాడు. సదరు నెటిజ‌న్‌ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా కరణ్ జోహార్ కూల్ గా `నీకు ఇంట్రెస్ట్ ఉందా?` అని సమాధానం ఇచ్చాడు. తాను గేనా..? కాదా..? అనే విషయం చెప్పకుండా నీకు ఆసక్తి ఉందా అని అడగడంతో సదరు నెటిజెన్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో క‌ర‌ణ్ ఆన్స‌ర్ వైర‌ల్ గా మారింది. కాగా, ఐదు ప‌దుల వ‌య‌సు వ‌చ్చినా క‌ర‌ణ్ జోహార్ ఇంతవ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. కానీ, ఈయ‌న సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు క‌వ‌ల‌ పిల్లలకు తండ్రి అయ్యాడు. కొడుకు పేరు యష్ కాగా.. కూతురు పేరు రూహి. ఈ పిల్ల‌ల‌కు త‌ల్లి ఎవ‌రు అన్న‌ది మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు.