పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా మిస్..చేసి ఉంటే!

ఒకే కుటుంబంలో నుంచి వచ్చి సినిమాలో స్టార్స్ గా మారడం అనేది మాములు విషయం కాదు. సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలిలో నుంచే ఎక్కువ మంది స్టార్స్ ఎంట్రీ ఇచ్చారు. ముందు సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే వారికంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ముందు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి మెగాస్టార్ అయ్యారు. ఆ తరువాత తన కుటుంబంలో వారికి ఒక అద్భుతమైన ప్లాట్ ఫామ్ రెడీ చేసాడు. మెగాస్టార్ తరువాత నాగబాబుని తీసుకొచ్చారు. హీరోగా నాగబాబు సక్సెస్ కాకపోయినా నిర్మాతగా మంచి విజయాలు సాధించాడు. చిరంజీవి ఆ తరువాత పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. అయితే పవన్ ఎంట్రీ ఇండస్ట్రీలో ఒక సంచలనం అనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ లో ఆయనకీ ఉన్న క్రేజ్ ఎవ్వరికి లేదనే చెప్పాలి. వరుసగా ఎన్నో ప్లాప్స్ వచ్చినా ఏ ఒక్క అభిమాని కూడా తగ్గలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్, మెగాస్టార్ కొడుకు రాంచరణ్ ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. RRR తరువాత రాంచరమ్ పేరు మారుమోగిపోతుంది. పుష్ప తరువాత అల్లు అర్జున్ టాప్ హీరో అయిపోయాడు. అంతే కాకుండా వరుణ్ తేజ్, సాయితేజ, వైష్ణవ్ తేజ్ కూడా ఇండస్ట్రీలో అదరగొడుతున్నారు.

అయితే వీరి కుటుంబలో పూర్తి స్థాయిలో ఏ ఇద్దరు కూడా మల్టిస్టార్రర్ సినిమా చెయ్యలేదు. తాజాగా ఆచార్యలో చిరంజీవి, రాంచరణ్ చేసారు. కానీ ఆ సినిమాలో రాంచరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో మాత్రమే నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు పెద్ద డిజాస్టర్ అయ్యింది. అల్లు అర్జున్ కూడా రాంచరణ్ చేసిన ఎవడు సినిమాలో 10 నిముషాలు ఉన్న పాత్ర మాత్రమే చేసాడు. పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి సినిమాల్లో అతిధి పాత్ర మాత్రమే చేసారు. అయితే ఒక క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. గతంలో పవన్ కళ్యాణ్, అల్లుఅర్జున్ తో ఒక ఫ్రాంచైజ్ ని తీయాలని దిల్ రాజు ప్లాన్ చేసారంట.


అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీతో ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాకి డైరెక్టర్ ని కూడా దిల్ రాజు రెడీ చేసుకున్నాడు. వరుస హిట్ సినిమాతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడితో ఈ సినిమా ప్లాన్ చేసాడు. అయితే పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ బిజీ అవ్వడంతో ఈ క్రేజీ కాంబినేషన్ కు బ్రేక్ పడింది. అయితే తరువాత అయినా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తే మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.