లైవ్ లోనే సిగ‌రెట్ తాగుతూ దొరికిపోయిన స‌ల్మాన్‌.. ఇంత క‌క్కుర్తి అవ‌స‌ర‌మా బాసు!

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ను నెటిజ‌న్లు ఏకేస్తున్నారు. ఆయ‌న వివాదాస్ప‌ద‌మైన చ‌ర్యనే ఇందుకు కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. స‌ల్మాన్ ఖాన్ రీసెంట్ గా `కిసీ కా భాయ్‌.. కిసీ కీ జాన్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తే.. విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క పాత్ర‌ను పోషించారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

ఈ మూవీ ఫ్లాప్ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్ బిగ్ బాస్ తో బిజీగా అయ్యాడు. ఓటీటీ బిగ్ బాస్ సీజ‌న్ 2కు ఆయ‌న హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బిగ్ బాస్ లైవ్ షోలో స‌ల్మాన్ సిగ‌రెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. శ‌నివారం ప్ర‌సారమైన వీకెండ్ ఎపిసోడ్‌లో స‌ల్మాన్ ఖాన్ కంటెస్టెంట్స్ త‌ప్పొప్పుల‌ను అనాలిసిస్ చేస్తూ మాట్లాడారు. అయితే ఆ స‌మ‌యంలోనే స‌ల్మాన్ ఖాన్ చేతిలో సిగ‌రెట్ ద‌ర్శ‌న‌మిచ్చింది.

 

ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు మ‌రియు యాంటీ ఫ్యాన్స్ స‌ల్మాన్ పై ట్రోలింగ్ షురూ చేశారు. ప‌బ్లిక్ గా ఇలాంటి చెత్త ప‌నులు చేస్తూ అభిమానుల‌కు ఏం సందేశం ఇవ్వాల‌నుకున్నావ్ స‌ల్మాన్..? అని కొంద‌రు తిట్టిపోస్తుంటే.. మ‌రికొంద‌రు లైవ్ షోలో ఇంత క‌క్కుర్తి అవ‌స‌ర‌మా బాసు అంటూ సెటైర్లు పేలేస్తున్నారు. మ‌రి ఈ విష‌యంపై స‌ల్మాన్ ఖాన్ స్పందిస్తాడా.. లేదా.. అన్న‌ది చూడాలి. సినిమాల విష‌యానికి వ‌స్తే.. స‌ల్మాన్ ఖాన్ న‌టించిన టైగ‌ర్ 3, కిక్ 2 చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అలాగే `ప్రేమ్ కీ షాదీ` అనే మ‌రో ప్రాజెక్ట్ లో స‌ల్మాన్ భాగం అయ్యాడు.