సలార్ తెలుగు హక్కుల కోసం అగ్ర నిర్మాత.. రిస్కేనా..?

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరు సంపాదించింది. తెలుగు రైట్స్ కోసం ఇప్పటికే ఎంతోమంది అగ్ర నిర్మాతలు సైతం పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా దక్కించుకొని పరిధిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ సినిమా రైట్స్ కోసం చాలా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Aravind interested in Salaar, but.... - JSWTV.TV

గీత ఆర్ట్స్ 50వ వార్షికోత్సవం సందర్భంగా అల్లు అరవింద్ సలార్ సినిమాని చాలా గ్రాండ్ గా విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ హోం భలే ఫిలింస్ నుంచి అల్లు అరవింద్ చేతికి సలార్ సినిమా హక్కులు రావాలి అంటే అది చాలా కష్టమైన పని అన్నట్లుగా తెలుస్తోంది. వ్యాపార రంగంలో హోం భలే ఫిలిమ్స్ వారు చాలా తెలివిగా వ్యవహరిస్తూనే ఉంటారు. గతంలో కూడా కేజిఎఫ్ , కేజిఎఫ్-2 సినిమా తెలుగు హక్కులను కూడా వారు విక్రయించలేదు అప్పట్లో ఘననేయమైన ఆఫర్లు వచ్చినా కూడా వాటిని పూర్తిగా విక్రయించకుండానే కమిషన్ ప్రతిపాదకంగా విడుదల చేయడం జరిగిందట. దీంతో భారీగానే లాభాలు పొందినట్టు తెలుస్తోంది.

అందువల్లే హోం భలే ఫిలిమ్స్ వారు సినిమాలను చాలా ప్లాన్ చేసి జాగ్రత్తగా విడుదల చేస్తూ ఉంటారు. కే జి ఎఫ్ -2 తరహాలోనే సినిమా ఉండబోతూ ఉండడంతో హోం బలే సంస్థ ఈ సినిమా హక్కులను విక్రయిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అవకాశం వస్తే ఖచ్చితంగా అల్లు అరవింద్ ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు వీలుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి హోం భలే ఫిలింస్ వారు అల్లు అరవింద్ తో చర్చలు జరుపుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 28న సలార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.