బేబీ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న రామ్‌ పోతినేని.. ఆపై బిగ్ సర్‌ప్రైజ్!

ఇటీవలే విడుదల అయిన ‘బేబీ’ సినిమా విజయంతో ఆ సినిమా హీరోయిన్ వైష్ణవి కి బాగా క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలు, సినీ ప్రముఖు లు ఆమె నటనకి, అందానికి ఫిదా అవుతున్నారు. ‘బేబీ ‘ సినిమా చిన్నదే అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య,విరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఆనంద్ దేవరకొండ, విరాజ్ ల కంటే వైష్ణవి నటన అద్భుతంగా ఉంది అని అందరూ పోగుతున్నారు.

అంతేకాకుండా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు వైష్ణవి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హీరో రామ్ పోతినేని కూడా వైష్ణవి ని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నాడు. అతను బేబీ మూవీ చూసిన వెంటనే ప్రత్యేకంగా వైష్ణవి కోసం పెద్ద పువ్వుల బొకేని పంపించాడు. రామ్ పంపిన అందమైన పువ్వులను చూసి వైష్ణవి మురిసిపోతుంది. రామ్ లాంటి హీరో స్వయంగా ఆమె కోసం ఫ్లవర్స్ పంపడం చూసి వైష్ణవి గాల్లో తేలిపోతుంది. అందమైన పువ్వులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.

ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య,రామ్ పోతినేనికి కృతజ్ఞతలు తెలిపింది. వైష్ణవి షేర్ చేసిన ఫోటోలు చూసి చాలామంది ‘ స్టార్ హీరోల చేత మంచి ప్రశంసలు అందుకొని టాలీవుడ్ లో వైష్ణవి బాగా క్రేజ్ పెంచుకుంటుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బేబీ సినిమాతో వైష్ణవి కెరీర్ మారిపోయినట్లే అని అంత మాట్లాడుకుంటున్నారు. యూట్యూబ్ లో రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించే వైష్ణవి  ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఇంత మంచి పేరు తెచ్చుకుంటుంది అని ఎవరు ఊహించి ఉండరు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ సినిమా 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 33 కోట్లు కలెక్ట్ చేసింది.