అన్ స్టాపబుల్-3 ఆలస్యం కావడానికి కారణం..?

బాలకృష్ణ హోస్టుబ్గా ఆహ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి క్రేజీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇందులో బాలయ్య హోస్టుగా అదరగొట్టేసారని చెప్పవచ్చు.. అన్ స్టాపబుల్ సీజన్ మొదటి రెండవ భాగం బాగా సక్సెస్ అవడంతో కొద్దిగా సీజన్ 3 ని కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అభిమానులు అన్ స్టాపబుల్-3 సీజన్ ఉంటుందా లేదా అంటూ పలువురు అభిమానులు డౌట్ పడుతున్నారు.

Unstoppable with NBK | Balakrishna | An aha Original | Premieres November 4  - YouTube

ఆహా టీం నుంచి ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.. అందుతున్న సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్-3 సీజన్ ఉంటుంది.. కానీ ఇప్పుడే కాదని బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి చేశాక డైరెక్టర్ బాబి దర్శకత్వంలో మరొక సినిమాలో నటించబోతున్నారు. అయితే అన్ స్టాపబుల్-3 సీజన్ నవంబర్ , డిసెంబర్ నెలలో మొదలు కాబోతున్నట్లు సమాచారం.అయితే ఈసారి ఆహా టీం ఈ సీజన్ ని మరింత క్రేజీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఎలాంటి షోలకు ఈవెంట్లకు రాని వారిని గెస్ట్లుగా పిలవబోతున్నట్లు సమాచారం. మరి ఏది ఏమైనా అన్ స్టాపబుల్-3 షో వల్ల బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. మరి ఈసారి ఈ షో ఎంతమంది ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే ఈ విషయంపై ఆహ టీం స్పందిస్తే బాగుంటుంది. బాలయ్య ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.