తెలుగు అవకాశాల కోసం ప్రియా వారియర్ తిప్పలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో వింక్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. ఒరు ఆధార్ లవ్ టీజర్ తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ పాపులర్ అయిన తెలుగులో లవర్స్ డే గా విడుదలయ్యింది. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి మరి ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఈ టీజర్ తో వచ్చిన క్రేజీని మాత్రం ఈ సినిమా నిలబెట్టుకోలేక పోయిందని చెప్పవచ్చు. ఈ టీజర్ టైంలోనే ప్రియా కి తెలుగులో కూడా వరుసగా అవకాశాలు రావడం జరిగింది కానీ అప్పుడు రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

SC cancels criminal proceedings against Malayalam actor Priya Prakash  Varrier | Latest News India - Hindustan Times

కానీ ఒక్కసారిగా ఈ సినిమా ప్లాప్ అవడంతో ప్రియా వారియర్ తనంతట తాను వచ్చి సినిమా అవకాశాలను అడిగిన మేకర్స్ లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడప దడపా సినిమాలు చేస్తూ పలు రకాల ఫోటో షూట్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో కూడా ఘాటైన ఫోజులతో అవకాశం కోసం గ్లామర్ వలకబోయడానికైనా సిద్ధమే అన్నట్లుగా తన ఫోటోలతో ఇంటి ఇస్తూ ఉంటుంది.తెలుగులో ఒక్క సినిమా హిట్టుపడే అవకాశం కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇటీవలే వచ్చిన యంగ్ హీరోయిన్ శ్రీ లీల తెలుగులో స్టార్ క్రేజ్ ని అందుకోవడం జరిగింది. ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రియ వారియర్ ను మాత్రం ఎందుకు పట్టించుకోలేదు.. కానీ గ్లామర్ తో మేకర్ దృష్టిలో పడేందుకు మాత్రం ఈ అమ్మడు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరి రాబోయే రోజుల్లోనైనా ప్రియ వారియర్ కు తెలుగులో ఒక సినిమా అవకాశం వస్తుందేమో చూడాలి మరి.