RRR -2 సినిమా డైరెక్షన్ చేసేది ఆ డైరెక్టరెనా.. రాజమౌళి మెగ ప్లాన్..!

రాజమౌళి సినిమాల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్రప్రసాద్ అభిమానులను ఎప్పుడూ కూడా తమ సినిమాల అప్డేట్లను తెలియజేస్తూ ఫుల్ ఖుషి చేస్తూ ఉంటారు..RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ చేసి ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేశారు. అంతేకాకుండా RRR -2 కూడా ఉండబోతోంది అంటూ రాజమౌళి హింట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా మళ్లీ కలిసి నటించబోతున్నారని తెలిపారు.

Did SS Rajamouli's son Karthikeya get the maths all wrong? | Hindi Movie News - Times of India

అయితే ఈ సినిమాకి మాత్రం డైరెక్ట్ సెండ్ చేయకుండా కేవలం ఆయన పర్యవేక్షణలోనే RRR -2 సినిమా తీయాలనుకుంటున్నట్లు విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. అయితే రాజమౌళి డైరెక్షన్ చేయకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాకి ఒప్పుకుంటారా అని అనుమానాలు కూడా అభిమానులు కలుగుతోంది .అయితే వీరిని ఒప్పించే పనిలో రాజమౌళి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి RRR -2 చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఎవరికీ ఇస్తారు అనే విషయంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్న తరుణంలో.. ఈ చిత్రాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ డైరెక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి ప్రతి సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూ ఆయనకు రైట్ హ్యాండ్ గా ఉన్న కార్తికేయ బాహుబలి సినిమాలో కొన్ని సన్నివేశాలను ఆయనే షూట్ చేశారని తెలుస్తోంది. RRR చిత్రానికి కూడా కార్తికేయ బాగానే సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా సెట్స్ మీదికి వెళ్ళినప్పటి నుంచి విడుదల అయ్యేవరకు రాజమౌళిని మించి కార్తికేయ ఈ సినిమాకి పనిచేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. RRR సినిమాకు ఆస్కార్ రావడం వెనుక కూడా కార్తికేయ కష్టం చాలానే ఉందని తెలుస్తోంది. ఒకవేళ కార్తికేయ కూడా కాకుంటే బ్రహ్మాస్త్ర సినిమాని డైరెక్షన్ చేసిన అయాన్ ముఖర్జీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.