చీర‌లో చిత్ర‌వ‌ధ చేస్తున్న‌ కళ్యాణి ప్రియదర్శన్.. చూపు తిప్పుకోవ‌డం కూడా క‌ష్ట‌మే!

కళ్యాణి ప్రియదర్శన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెన్నైలోని ఓ మలయాళీ కుటుంబంలో జ‌న్మించిన క‌ళ్యాణి.. ప్రొడక్షన్ డిజైనర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ త‌ర్వాత ఆర్ట్ డైరెక్టర్‌గా వ‌ర్క్ చేసిన కళ్యాణి.. అఖిల్ అక్కినేని హీరోగా తెర‌కెక్కిన `హ‌లో` మూవీతో హీరోయిన్ గా వెండితెర‌పై అడుగు పెట్టింది. హ‌లో సినిమా ఫ్లాప్ అయినా క‌ళ్యాణికి మాత్రం మంచి గుర్తింపు వ‌చ్చింది.

హ‌లో త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా `చిత్రలహరి` మూవీలో న‌టించి ఫ‌స్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో కంటే త‌మిళ్, మ‌ల‌యాళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. గ‌త ఏడాది హృదయం, బ్రో డాడీ వంటి హిట్ చిత్రాల్లో క‌ళ్యాణి న‌టించింది. ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో రెండు చిత్రాల్లో న‌టిస్తున్న క‌ళ్యాణి.. తాజాగా కోలీవుడ్ స్టార్ జ‌యం ర‌వి హీరోగా తెర‌కెక్కుతున్న `జీని` మూవీకి కమిట్ అయింది.

ఇందులో కృతి శెట్టి, వామికా గ‌బ్బి కూడా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అర్జున‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం చెన్నైలో బుధ‌వారం ప్రారంభ‌మైంది. అయితే ప్ర‌రంభోత్స‌వ వేడ‌క‌లో స్కై బ్లూ క‌ల‌ర్ చీర‌లో అందంగా ద‌ర్శ‌న‌మిచ్చి కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపింది. చీర చాటు దాగి ఉన్న త‌న అందాల‌తో చిత్ర‌వ‌ధ చేసింది. క‌ళ్యాణి తాజా ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ పిక్స్ ను చూస్తే చూపు తిప్పుకోవ‌డం కూడా క‌ష్ట‌మే. చీర‌లో క‌ళ్యాణి అంత అందంగా క‌నిపిస్తోంది.