రష్మిక పరిస్థితి ఇలా అయిపోయిందేంటి.. ఆమె చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా

మొదటి సినిమా నుంచి రష్మికకు తెలుగు సినీ ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఆమె స్థాయిని బాగా పెంచింది. అయితే ఆమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలను వదిలి బాలీవుడ్ వైపు మొగ్గు చూపింది. దీంతో అక్కడే పాగా వేయాలని ఆమె భావిస్తోంది. ఫలితంగా తెలుగు సినిమా అవకాశాలను ఆమె చేజేతులా వదిలేసిందనే విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ఆమె పరిస్థితి ఖాళీ అయిపోయినట్లేనని అంతా అంటున్నారు. సౌత్‌లో ఎన్నో హిట్లు ఆమె అందుకుంది. అయితే బాలీవుడ్ బెటర్ అనే అభిప్రాయంతో అక్కడికి వెళ్లిపోయింది. ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడింది. అయినా ఆమెను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో అక్కడ ఒక్క హిట్ కూడా దక్కకపోవడంతో ఆమె తిరిగి సౌత్ వైపు చూస్తోందనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం తెలుగులో ఆమెకు అవకాశాలొస్తాయా లేదా అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి.

టాలీవుడ్‌లో రష్మిక ప్రస్తుతం ఒకే ఒక సినిమా చేస్తోంది. ఆమె ఖాతాలో దర్శకుడు వెంకీ కుడుముల ప్రాజెక్టు మాత్రమే ఉంది. బాలీవుడ్ తనకు సక్సెస్ అందించకపోవడంతో తిరిగి సౌత్ వైపు చూస్తోందీ కన్నడ భామ. తెలుగులో బిజీ అవ్వాలని భావిస్తోంది. అయితే తెలుగులో ఆమెకు అవకాశాలు వస్తాయా అనేది మాత్రం చెప్పలేం. ప్రస్తుతం అంతా కొత్త కొత్త హీరోయిన్ల కోసం చూస్తున్నారు.

దీంతో రష్మిక పరిస్థితి కొంచెం కష్టమనే చెప్పాలి. విజయ్ దేవరకొండతో ఆమె జోడీ తెలుగులో హిట్ గా నిలిచింది. దీంతో విజయ్‌తో ఆమె మరో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది సాధ్యమవుతుందో లేదో చెప్పలేం. కానీ టాలీవుడ్‌లో రష్మిక కెరీర్ క్లోజ్ అయిపోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో భారీ ప్రాజెక్టులో ఆమె నటించి అది బ్లాక్ బస్టర్ అయితే తప్పా పరిస్థితి మారదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.