డెలివ‌రీ త‌ర్వాత నాకూ ఆ స‌మస్య ఎదురైంది.. సీక్రెట్స్ లీక్ చేసిన కాజ‌ల్‌!

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణతో `భ‌గ‌వంత్ కేస‌రి`, త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ కు జోడీగా `ఇండియ‌న్ 2` చిత్రాలు చేస్తోంది. అలాగే రీసెంట్ గా `స‌త్య‌భామ‌` అనే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు క‌మిట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న వ్య‌క్తిగ‌త జీవితంకు సంబంధించి ప‌లు సీక్రెట్స్ లీక్ చేసింది.

ఈ క్ర‌మంలోనే డెలివ‌రీ త‌ర్వాత తాను ఫేస్ చేసిన డిప్రెష‌న్ స‌మ‌స్య గురించి బ‌య‌ట పెట్టింది. దాదాపు మ‌హిళ‌లంద‌రూ డెలివ‌రీ అయిన తర్వాత ఏదో ఒక కారణం తో డిప్రెషన్ కి గుర‌వుతూ ఉంటారు. నాకూ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ స‌మ‌స్య ఎదురైంద‌ని కాజ‌ల్ చెప్పుకొచ్చింది. అయితే తనను ఎంతగానో అర్థం చేసుకునే ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఉండటం వల్ల ఆ దశ నుంచి వెంటనే బయటకు రాగలిగానని కాజ‌ల్ తెలిపింది.

అలాగే తాను డిప్రెషన్ తో బాధ‌ప‌డుతున్న టైమ్‌లో త‌న భ‌ర్త గౌతమ్‌ క్లిచ్లూ అండంగా నిలిచాడ‌ని.. త‌న‌ను మ‌ళ్లీ మామూలు మ‌నిషిగా మార్చేందుకు ఎంతో కృషి చేశాడ‌ని కాజ‌ల్ తెలిపింది. మహిళలు ఎవరైనా పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌తో ఇబ్బందిపడుతుంటే ఫ్యామిలీ మెంబ‌ర్స్ వారికి అండగా నిలవాలని సూచించింది. అంతేకాదు, పిల్లలు పుట్టిన తర్వాత మ‌హిళ‌లు తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలని, వర్కౌట్లు చేయడం, ఇష్టమైన వ్యక్తులతో టైమ్ స్పెండ్‌ వంటి చిన్న చిన్న పనులతో పోస్ట్‌పార్టమ్ దశను దాటొచ్చని కాజ‌ల్ పేర్కొంది. దీంతో కాజ‌ల్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.